సమాధిలో ధ్యానం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 5:06 AM GMT
సమాధిలో ధ్యానం

ఒత్తిడి... ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఒత్తిడి జీవితంలో భాగమైపోయింది. మూడున్నర ఏళ్లు నిండిన చిన్నారి ఎల్కేజీ అంటూ స్కూలు వెళ్లడంతో ఈ ఒత్తిడి మొదలవుతుంది. ఆ తర్వాత పైచదువులూ, ఉద్యోగాలు, సంపాదన.. ఇలా మాథ్స్ టెస్ట్ బుక్ లో కంటే జీవితంలోనే ప్రాబ్లెమ్స్ ఎక్కువ అని ఫీల్ అవుతారు విద్యార్థులు. ఇక కొంత మంది విద్యార్థులు తోటి విద్యార్థులతో చదువులో పోటీపడి ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకున్న సందర్భాలు చూస్తున్నాం.

అందుకే నెదర్లాండ్స్లోని నిజ్మా జెన్ నగరంలో ఉన్న రాడ్ బౌడ్ యూనివర్సిటీ దీనిపై సరికొత్త ఆలోచన చేసింది. ప్యూరిఫికేషన్ గ్రేవ్ పేరుతో విద్యార్థుల కోసం సమాధులు తవ్వించింది. ఇందుకోసం పచ్చని చెట్ల మధ్యలో గోతిని తవ్వి అందులో ఒక దిండు, యోగా మాట్‌లని పెట్టింది. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న విద్యార్థులు అందులో పడుకొని 30 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ధ్యానం చేసుకోవచ్చు.

అయితే ఇందులోకి మొబైల్ ఫోన్, పుస్తకాలను అనుమతించరు. గతంలో ఈ పద్ధతిని ప్రవేశ పెట్టినప్పుడు 39మంది మాత్రమే దీనిని వినియోగించుకున్నట్లు సమాచారం. అయితే సమాధిలో ధ్యానం సంగతేమోగానీ, అసలు ఈ సమాధిలో పడుకునే ఎక్స్పీరియన్స్ గురించి విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. విద్యార్థుల కోరిక మేరకే వీటిని తిరిగి ప్రారంభించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీనిని మెమెంటో మోరీగా పిలుస్తున్నారు. అయినా బతికి ఉండే నాల్రోజులూ నలిగిపోతే ఎలా? మీరు కూడా ఏదో ఒక ధ్యానపద్ధతిని ఫాలో అవ్వండి. హ్యాపీగా బతికేయండి.

Next Story