వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం

By రాణి  Published on  18 April 2020 8:25 AM GMT
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం

లాక్ డౌన్ కారణంగా అత్యవసరంగా వైద్యం కావాల్సిన వారు చాలా ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా గర్భిణుల పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది. గర్భిణులకు డెలివరీ చేయాల్సిన సమయం, లేదా చెకప్ సమయంలో అంబులెన్స్ వెంటనే స్పందించాలని, వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మొదట్లోనే ఆదేశాలిచ్చింది. కానీ వైద్య సిబ్బంది మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పాటించడం లేదు. తాజాగా సూర్యాపేటలో జరిగిన ఘటన వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Also Read : సోషల్ మీడియా పై ఉన్న పిచ్చే అతని ప్రాణాలు తీసింది

సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉంటున్నరేష్మ అనే మహిళకు అర్థరాత్రి పురిటి నొప్పులొచ్చాయి. దీంతో భర్త వెంకన్న అంబులెన్స్ కోసం 108 కు డయల్ చేయగా స్పందన లేదు. పదే పదే ప్రయత్నించగా ఒక గంట తర్వాత వస్తాంలే అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. పురిటి నొప్పులు ఎక్కువవ్వడంతో పక్కనే ఉన్న పీఎస్ కు వెళ్లి తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం కేటాయించాలని బ్రతిమాలాడు. ఆ సమయానికి స్టేషన్ లో డ్రైవర్లు లేకపోవడంతో దిక్కుతోచక భార్యను చేతులపై ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే రేష్మకు రోడ్డుపై ప్రసవం అయింది. ఈలోగా స్థానికులు ఆటోను వెంటబెట్టుకుని రాగా గబగబా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Also Read : మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య

జనరల్ ఆస్పత్రిలో సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పటికీ ఈ సమయంలో వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. స్వయానా కోదాడ రూరల్ సీఐ వచ్చి అడిగినా వారి సమాధానంలో ఎలాంటి మార్పు లేదు. 108కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి తల్లి బిడ్డలను ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కానీ గర్భిణీకి డెలివరీ చేయాల్సిన సమయంలో వైద్య ఇబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఇండియన్ నేవీలో కరోనా కలకలం..26 మందికి పాజిటివ్

Next Story