సోషల్ మీడియా పై ఉన్న పిచ్చే అతని ప్రాణాలు తీసింది

By రాణి  Published on  18 April 2020 7:30 AM GMT
సోషల్ మీడియా పై ఉన్న పిచ్చే అతని ప్రాణాలు తీసింది

21 రోజుల లాక్ డౌన్ లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించిన సంగతి విధితమే. ఈ లాక్ డౌన్ లో చాలా వరకూ వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారు. అది సరే..కానీ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు లేని యువత ఏం చేస్తుందో తెలుసా? సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్. పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకూ అదే పనిలో ఉంటోంది యువత. డ్యాన్స్ లు, డైలాగ్ లు చెప్తూ ఫేమస్ అయ్యే పనిలో పడ్డారు. అలా ఒక యువకుడు టిక్ టాక్ కు బానిసయ్యాడు. తన క్రియేటివిటీని ఉపయోగించి చాలా వీడియోలు చేశాడు. కానీ ఎంత క్రియేటివ్ గా చేసినా లైక్ లు రావట్లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలోని సాలార్పూర్ లో జరిగింది.

Also Read : మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య

రకరకాల స్టైల్స్ లో వీడియోలు, స్టంట్లు చేసినా లైక్ లు రాకపోవడంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. టిక్ టాక్ లో ఆ యువకుడు చేసే వీడియోలకు లైక్ లు రాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు. అందుకే ఏది ఎంతవరకూ ఉపయోగమో..అంతవరకే వాడాలి. అదేపనిగా వాడకం మొదలుపెడితే బానిసలై..పిచ్చోళ్లై..ఆఖరికి ఇలా ప్రాణాలు తీసుకుంటారు. సోషల్ మీడియా వల్ల మంచి ఎంత ఉందో..చెడు కూడా అంతే ఉంది.

Also Read : ఇండియన్ నావీలో కరోనా కలకలం..26 మందికి పాజిటివ్

Next Story
Share it