మేడ్చల్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య.. పక్కనే చిన్నారి

By సుభాష్  Published on  13 April 2020 10:34 AM IST
మేడ్చల్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య.. పక్కనే చిన్నారి

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌లో జంట ఆత్మహత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెంటల్ కళాశాల డంపింగ్‌ యార్డులో ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు యువతులు వేర్వేరుగా ఉరివేసుకున్న సంఘటనను గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు ఈ ఘటన స్థలంల పక్కనే మరో చిన్నారి కూడా ఉండటంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Mechal Crime..1

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఉరివేసుకున్న ప్రాంతంలో కూల్‌డ్రింగ్‌ బాటిల్‌ కనిపించడంతో పోలీసులు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏదైనా విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముందుగా పాపకు విషం తాగించిన తర్వాత వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మహిళల్లో ఒకరు పాపకు తల్లిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story