ఆస్ట్రేలియా విధ్వంసర ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఫిబ్రవరిలోనే భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట భారత సంప్రదాయం ప్రకారం మరోసారి నిశ్చితార్థ వేడుక చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. భారత సంప్రదాయ ప్రకారం జరిగే వివాహ వేడుక ఎంత అద్భుతంగా ఉంటుందో, హంగు ఆర్భాటాలు ఎలాగుంటాయో తన నిశ్చితార్థ వేడుకలో చూపించిందట మ్యాక్స్‌వెల్‌కు కాబోయే భార్య. తాజాగా ఈ ఫొటోల‌ను వినీ త‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా.. క్ష‌ణాల్లో వైర‌ల‌య్యాయి.

భార‌తీయ వ‌స్త్రాధార‌ణ‌తో మ్యాక్సీ-వినీ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఆకుప‌చ్చ షేర్వాణీ ధ‌రించి, నుదుటిన తిల‌కంతో మ్యాక్స్‌వెల్ అందంగా ఉన్నాడు. ప‌క్క‌నే వినీ కూడా గాగ్రా చోళీతో ఆకర్ష‌ణీయంగా ఉంది. ఇక మ్యాక్సీతో పాటు కుటుంబ సభ్యులు సైతం చీర, లెహెంగా వంటి సంప్రదాయ దుస్తులే ధరించడం ప్రత్యేకం. ‘గత రాత్రి మేం భారత సంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో మాక్సీకి చిన్న టీజర్‌ చూపించాను. మా రెండు కుటుంబాలు, మిత్రులు ఈ వేడుకను చూసి ఆనందించారని’ వినీ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

Untitled 3 Copy

మ‌రోవైపు చాలా తక్కువ స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింద‌ని, అయినా కూడా అంద‌రూ హాజ‌రై త‌మ‌ను ఆశీర్వ‌దించార‌ని మ్యాక్సీ ఆనందం వ్య‌క్తం చేశాడు. కాగా మక్స్‌వెల్‌, వినీరామన్‌ చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి వేడుకలు, షికార్లకు వేళ్లేవారు. ఆ మధ్య మాక్స్‌వెల్‌ మానసికి అనారోగ్యంతో బాధపడుతున్నాడని క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు కదా.. అతడికి విరామం అవసరం అని మొదట గుర్తించింది వినీనే. ఫిబ్రవరిలోనే తనను వివాహాం చేసుకుంటావా అని మాక్సీ .. వినీ ని అడగగా.. అందుకు ఆమె సంతోషంగా ఒప్పుకుంది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.