ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా.. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి వినీ రామన్‌తో ఈ ఆల్‌రౌండర్‌ నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌. ఈ ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాక్సీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స‌హా చాలామంది సోష‌ల్ మీడియాలో కంగ్రాట్స్ చెబ‌ుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ట్రెండీగా మారింది.

ఇదిలా ఉంటే.. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదుకానీ.. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుందని.. వీరి సన్నిహితులు తెలిపారు. ఒత్తిడి తదితర కారణాలతో ఆసీస్ జట్టు నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న మ్యాక్స్‌వెల్‌.. బిగ్‌బాష్‌లీగ్‌లో అద‌ర‌గొట్టాడు. మెల్‌బోర్న్ స్టార్స్‌కు నేతృత్వం వ‌హించిన మ్యాక్సీ.. సూప‌ర్ ఫామ్‌తో జ‌ట్టును ఫైన‌ల్ దాకా తీసుకెళ్లాడు. కాగా.. ఈ లీగ్‌ మాక్స్‌వెల్‌ మోచేతికి గాయమైంది. ఇటీవలే.. మోచేతికి సర్జరీ చేయించుకున్న ఈ ఆటగాడు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌ తరుపున బరిలోకి దిగనున్నాను.

మార్చి 29 నుంచి లీగ్‌ ఆరంభం కానుండగా.. ఏప్రిల్‌ నెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నాడు. గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా హిట్టర్‌ని.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ రూ. 10.75 కోట్లకి సొంతం చేసుకుంది. గతంలో భార‌త సంత‌తి యువ‌తిని ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ షాన్ టెయిట్ వివాహం చేసుకుని ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. మాషూమ్ సింగాను 2014లో టెయిట్ పెళ్లి చేసుకున్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.