'మత్తు వదలరా' టీజర్ ను చ‌ర‌ణ్ రిలీజ్ చేయ‌డానికి కార‌ణం ఇదే..?

By Newsmeter.Network  Published on  8 Dec 2019 7:05 AM GMT
మత్తు వదలరా టీజర్ ను చ‌ర‌ణ్ రిలీజ్ చేయ‌డానికి కార‌ణం ఇదే..?

కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ మత్తు వదలరా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా, ఈ చిత్ర టీజర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు.

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే వుద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో చిత్రం వుంటుంది. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. రాజ‌మౌళి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వ‌ల‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేసారు.

Next Story
Share it