యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ‘నీతోని కష్టమే కృష్ణవేణి’ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ లు నటిస్తున్నారు.

లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అయితే.. కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 31 వరకు థియేటర్స్‌ బంద్‌ కానున్నాయి. దీంతో ఈ చిత్ర విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.