టాలీవుడ్ యంగ్ హీరో, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పుట్టిన రోజు నేడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ‘రెడ్’‌. స్ర‌వంతి ర‌వికిషోర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నివేథా పేతురాజ్, మాళవిక శర్మ న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.

మొద‌టి సారి రామ్ ద్విపాత్రిభిన‌యం చేస్తున్నాడు. రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని ఓ మంచి మాస్ మ‌సాలా బీట్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ’12 డ‌బ్బాల ప్యాసింజ‌ర్ బండి ఎక్కి 11 గంట‌ల‌కు పోదామ‌న్న‌డు బొంబాయికి’ అంటూ సాగే ఈ పాట‌లో రామ్, హెబ్బాప‌టేల్‌తో క‌లిసి చిందులేశాడు. పాట పుల్ హుషారు ఎక్కిస్తోంది. కాసర్ల‌శ్యామ్ రాసిన ఈ పాట‌ను సాకేత్‌, కీర్త‌నా శ‌ర్మ పాడారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *