కూతురు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసు నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ పలు కీలక అంశాలు మీడియా ముందు చెప్పారు. కేసు ట్రయల్‌ దశకు వచ్చిందని.. దాని వల్లే ఒత్తిడికి గురై మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సోదరుడు శ్రవణ్‌. ప్రణయ్‌ హత్య కేసులో నాకు సంబంధం లేకున్నా జైలు శిక్షను అనుభవించానని చెప్పారు. గత ఏప్రిల్‌ నెల నుంచి మా అన్నతో నాకు మాటలు లేవని చెప్పారు. ఆత్మహత్య విషయం తెలియగానే మా వదినను తీసుకుని ఆస్పత్రికి వచ్చానని పేర్కొన్నారు. మా అన్నతో ఎలాంటి విబేధాలు లేవు. మా కుటుంబంలో ఎలాంటి ఆస్తి వివాదాలు కూడా లేవని శ్రవణ్ స్పష్టం చేశారు.

అలాగే మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. కేసు వీలునామా చుట్టూ తిరుగుతోంది. ప్రణయ్‌ హత్య తర్వాత మా అన్న రాసిన వీలునామాను నేను రద్దు చేయించానని చెప్పారు. ప్రాణహాని ఉందని తన ఆస్తిలో సగం ఆస్తి నాకు చెందేలా వీలునామా రాశారు. జైలుకు వెళ్లి వచ్చాక వీలునామా రద్దు చేయించానని చెప్పారు. మా మధ్య ఆర్థిక, లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు లేవున్నారు. మారుతీరావు వీలునామా మార్చడానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌ చింతలగూడ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో నింద్రించిన మారుతీరావు.. ఆదివారం ఉదయం చూసేసరికి విషం తాగి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా..? లేక సాధారణ మరణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వేధింపుల వల్లే మారతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.