మారుతీరావు శరీరం రంగు ఎందుకు మారింది..? పోస్టుమార్టంలో ఏముంది?
By Newsmeter.Network Published on 9 March 2020 11:13 AM IST
మారుతీరావు ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో సంచనలంగా మారింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఆదివారం పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమృతరావు మృతదేహానికి ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు.
కాగా సోమవారం పోస్టుమార్టం రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మారుతీరావు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు. మారుతీరావు శరీరం కలర్‌గా మరడానికి పాయిజన్‌ను గారెల్లో పెట్టుకొని తినడమేనని వైద్యులు తేల్చారు. కాజ్ ఆఫ్ డెత్ పాయిజనింగ్ వల్లే జరిగిందని, పాయిజన్ బాడీ మొత్తం పోవడంతో ఆర్గాన్స్ ఆగిపోయాయని వైద్యులు తెలిపారు. మారుతీరావు బాడీకి బ్లెడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్ అయినట్లు ప్రాథమిక రిపోర్టులో వైద్యులు అభిప్రాయ పడ్డారు.
మారుతీరావు విస్రా శ్యాంపిల్‌ను సేకరించిన ఫోరెన్సిక్ వైద్యులు.. విస్రా ఎనాలసిస్‌లో మారుతీరావు ఎటువంటి పాయిజన్ తీసుకున్నాడో తెలుస్తుందని పేర్కొనంటున్నారు. ఇదిలాఉంటే మారుతీరావు అత్యక్రియలు తన స్వగ్రామం మిర్యాలగూడంలో నిర్వహించనున్నారు. మిర్యాలగూడెలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
తన తండ్రి చివరి చూపు చూసేందుకు అమృత రావటానికి పోలీసుల భద్రత కోరడంతో.. తల్లీ, కుటుంబ సభ్యులు మాత్రం మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు అనుమతించేది లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మారతీరావు ఇంటి వద్ద, అమృత నివాసం ఉండే ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.