వివాహిత ఆత్మహత్య..వేధింపులే కారణమా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:27 AM GMT
వివాహిత ఆత్మహత్య..వేధింపులే కారణమా..?

హైదరాబాద్: అంబర్ పేట్ బాపునగర్‌లోని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని వివాహిత బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే.. వివాహం జరిగి నెల కూడా గడవక ముందే.. భర్త, అత్త , వారి బంధువులు నిత్యం వేధింపులకు గురిచేశారని వివాహిత తరపు వారు అంటున్నారు. దీంతో ఆ బాధను తట్టుకోలేక పుట్టింటికి వచ్చి... ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సమాచార అందుకున్న స్థానిక అంబర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై సెక్షన్ 174 కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే తన కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, వాళ్ల కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లితండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

Next Story