క్రికెట్ నుండి ఆ చెత్త రూల్ తీసేయండి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2020 8:51 PM ISTగత కొన్నేళ్లుగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయ్. కొత్త ఫార్మాట్‌లు, ఫీల్డింగ్ ఇలా క్రికెట్‌లో ఐసీసీ పలు మార్పులు చేసింది. అయితే క్రికెట్‌లో ఆ రూల్‌ను తొలగించాలని ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్ వా అంటున్నాడు. అంతేకాదు క్రికెట్‌లో అదొక వేస్ట్ రూల్ అని అంటున్నాడు. అలాగే ఆ రూల్‌ను మార్చాలంటూ ఐసీసీకి విన్నవించాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ బిగ్ బాష్‌లో గురువారం మెల్‌బోర్న్ స్టార్స్ - సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు మార్క్ వా కామెంటేటర్‌గా వ్యవహరించాడు. అయితే.. కామెంటరీలో బాగంగా బ్యాట్స్‌మెన్ తీసే లెగ్ బైస్‌పై మార్క్‌వా తీవ్ర విమర్శలు చేశాడు. దీనికి కారణం.. సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్ బైకి పరుగులు చేయడం. దీనిపట్ల మార్క్ వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ విషయమై మార్క్‌వా మాట్లాడుతూ.. అదొక అనవసరపు రూల్ అంటూ పేర్కొన్నాడు. మనకు తెలిసి క్రికెట్‌లో లెగ్ బైస్ రూల్ ఎప్పడి నుండో అమలవుతుంది. ఈ రూల్ అవసరమా.. దీనిని మొత్తం క్రికెట్‌లో లేకుండా మార్చేయండి. బ్యాట్స్‌మెన్ బంతిని టచ్ చేయలేనప్పుడు అతనికి పరుగులు ఎందుకు ఇవ్వాలి. బాడికి, ప్యాడ్లకు బంతి తగిలితే లెగ్ బైస్‌గా పరుగులు తీసేస్తున్నారు. దీనివల్ల క్రికెట్‌లో పారదర్శకత లోపించినట్లే కనబడుతోంది’ అని వా తెలిపాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం వాతో విభేదించాడు. ఈ రూల్‌పై మొండిగా ఉన్నావంటూ మార్క్ వాను చమత్కరించాడు.
దీనిపై వా స్పందిస్తూ.. ఈ పద్ధతిని తాను మారుస్తానని అన్నాడు. దీనికి వాన్ స్పందిస్తూ..‘ నువ్వు క్రికెట్ లా మేకర్ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలని.. నువ్వు అందులో ఉంటే కొత్త విధానాలను తీసుకొస్తావని వాన్ పేర్కొన్నాడు. దానికి సమాధానంగా వా మాట్లాడుతూ.. నా సోదరుడు స్టీవ్ వా కూడా ఈ రూల్ మార్చాలని అంటున్నాడని.. దీనిపై దృష్టి పెట్టాలని అన్నాడు.