చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 7:24 AM GMT
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన చిత్రపరిశ్రమకి ప్రముఖుల వరుస మరణాలు మరింతగా బాధిస్తున్నాయి. బాలీవుడ్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన మరవకముందే మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్‌ భక్రే(32) బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌లోని తన నివాసంలోనే అశుతోష్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

గత కొన్ని రోజులుగా అశుతోష్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశుతోష్ నెల రోజుల క్రితమే నాందేడ్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తను చనిపోవడానికి ముందు ఓ వ్యక్తి అసులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడో వివరిస్తూ తన సోషల్‌ మీడియా పోస్టు చేశాడు అశుతోష్‌.

అశుతోష్ నాలుగేళ్ల క్రితం మరాఠీ టీవీ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2013లో వచ్నిన భకార్ చిత్రం అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మరాఠీలో పాప్యులర్ టీవీ షో అయిన ‘కులాటా కాలి కులానే’తో మయూరికి బాగా పేరొచ్చింది.

Next Story