విశాఖ ఏజెన్సీ: విశాఖ మన్యంలో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ కొనసాగుతుంది. గాలికొండ - గుత్తేడులో మావోయిస్ట్ భవాని పోలీసులకు పట్టుబడింది. బుల్లెట్ గాయాలతో ఆమె పోలీసులకు పట్టపడినట్లు సమాచారం. ప్రస్తుతం భవాని పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలిగా పని చేస్తుంది. 20 ఏళ్లుగా భవాని మావోయిస్ట్ ఉద్యమంలో పని చేస్తుంది. మావోయిస్ట్ స్టేట్ జోన్ కమిటీ సభ్యుడు జగన్ భార్య భవాని.