వావ్ మ‌నీష్.. వాట్ ఏ క్యాచ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jan 2020 7:27 PM IST
వావ్ మ‌నీష్.. వాట్ ఏ క్యాచ్‌..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆట‌గాడు మ‌నీష్ పాండే త‌న ఫీల్డింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(15)ను త‌న అధ్బుత‌మైన ఫీల్డింగ్‌తో పెవిలియ‌న్ చేర్చాడు. మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్సు నాలుగో ఓవర్‌ రెండో బంతిని వార్న‌ర్ ఆఫ్‌ సైడ్‌కు ఆడ‌గా.. మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌.. సింగిల్‌ హ్యాండ్‌తో ఒడిసిప‌ట్టుకున్నాడు.

మ‌నీష్ పాండే సూప‌ర్‌ క్యాచ్‌కు.. స్టేడియంలోని ప్రేక్షకులకు ఒక్కసారిగా ఆశ్చర్యాలకు గురయ్యాడు. అవాక్క‌యిన వార్నర్ క్రీజు నుండి నిరుత్సాహంతో వెనుదిరిగాడు. టీమిండియా ఆట‌గాళ్లు మనీష్‌ పాండే అసాధారణ ఫీల్డింగ్ ను త‌మ సెల‌బ్రేష‌న్స్‌తో కొనియాడారు. ప‌ర్పెక్ట్ టైమింగ్‌తో గాల్లోకి ఎగిరిన మ‌నీష్.. ఫోర్ వెళ్ల‌కుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ష‌మీ వికెట్ తీసినా ఆ క్రెడిట్ మొత్తం మ‌నీష్ ఖాతాలోకే వెళ్లింది.

ఇదిలావుంటే.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 340/6 పరుగులు చేసింది.. శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించారు. ఇక ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌కు 2 వికెట్లు కోల్పోయి 123 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (49), అబుచ్చానె (20) ప‌రుగులతో క్రీజులో ఉన్నారు.

Next Story