మంచు మ‌నోజ్ మ‌ల్టీమ‌ల్టీస్టార‌ర్ ప్లాన్. ఇదేంటి అనుకుంటున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 5:43 AM GMT
మంచు మ‌నోజ్ మ‌ల్టీమ‌ల్టీస్టార‌ర్ ప్లాన్. ఇదేంటి అనుకుంటున్నారా..?

మంచు మ‌నోజ్ మ‌ల్టీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ అంటున్నారు. మ‌ల్టీ మ‌ల్టీస్టార‌ర్ ఏంటి..? ఇదేదో త‌ప్పుగా రాశారు అనుకుంటే.. పొర‌పాటే. అసలు విష‌యం ఏంటంటే... ఒక‌రు కంటే ఎక్కువ మంది హీరోలు న‌టిస్తే ఆ సినిమాని మ‌ల్టీస్టార‌ర్ అంటారు. అదే న‌లుగురు లేదా ఐదుగురు హీరోలు క‌లిసి న‌టిస్తే.. మ‌ల్టీ మ‌ల్టీస్టార‌ర్ అనుకోవచ్చు. మంచు మ‌నోజ్ దీపావ‌ళి సంద‌ర్భంగా ఎం.ఎం ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించిన‌ట్టు తెలియ‌చేశారు.

ఈ బ్యాన‌ర్‌లో తొలి సినిమానే 'మ‌ల్టీమ‌ల్టీస్టార‌ర్' ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాని నిర్మించాలని మనోజ్‌ అనుకుంటున్నారు‌. ఓ మాంచి కామెడీ సినిమాగా రూపొందింస్తున్నారు. ఈ సినిమాలో అన్న‌య్య విష్ణుతో పాటు.. త‌న క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా అవకాశమిస్తున్నట్లు సమాచారం. మంచు విష్ణుతో పాటు మ‌నోజ్ ఫ్రెండ్స్ శింబు, మహత్, ఆది పినిశెట్టి న‌టించే అవ‌కాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది.

మంచు మ‌నోజ్ కూడా న‌టించే అవ‌కాశం ఉంది. ఈ సినిమాతో పాటు మ‌రో మూడు క‌థ‌లు కూడా రెడీగా ఉన్నాయని సమాచారం. దీంతో మనోజ్‌ ఏ క‌థ‌తో ముందు సినిమా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. త్వ‌ర‌లోనే వీటిలో ఓ క‌థ‌తో సినిమా చేసే ప్రయత్నంలో మనోజ్‌ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

Next Story
Share it