బ్రేకింగ్: మంచిర్యాల: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

By సుభాష్  Published on  15 May 2020 1:20 AM GMT
బ్రేకింగ్: మంచిర్యాల: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మంచిర్యాలలోని మందమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేకే టు గని వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు లక్షెట్టిపేటకు చెందిన సుజాత (35), కావ్య (19), మరొకరు బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కొమురయ్యగా గుర్తించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడున్న సీసీ టీవీ పుటేజీల ద్వారా ప్రమాదం జరిగిన తీరుపై పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రమాదాలు చాలా వరకూ తగ్గిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు ఇలా ఎన్నో దారుణ ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో కొన్ని కొన్ని వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల వల్ల వలస కూలీలు చాలా మంది వరకూ చనిపోయిన విషయం తెలిసిందే.

Next Story
Share it