భార్య తల నరికి.. ఆ తలతో ఊరంతా..
By Newsmeter.Network Published on 1 Feb 2020 8:57 PM IST
జీవితాంతం తోడుంటానని పెళ్లిలో ప్రమాణం చేశాడు. ఆమెతో అన్యోన్యంగా కలిసి ఉండాల్సింది పోయి.. ఆమె పాలిట యముడిగా మారాడు. కట్టుకున్న భార్యను చంపేసి.. అనంతరం ఆమె తలను శరీరం నుంచి వేరుచేసి పిచ్చిపట్టినవాడిలా ఊరు మొత్తం తిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఘటన వివరాల్లోకి వెళితే.. బహదుర్‌పురా గ్రామానికి చెందిన అకిలేశ్ రావత్ కు అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇటీవల అనారోగ్యం కారణంగా పాప మృతి చెందింది. దీంతో తరచు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శనివారం కూడా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇది తారాస్థాయికి చేరింది. దీంతో ఆగ్రహానికి గురైన రావత్.. రజనీ ని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా హతమార్చాడు. అనంతరం పదునైనా ఆయుధంతో ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు. అనంతరం ఆమె తలను పట్టుకుని 1.5 కిలోమీటర్లు పిచ్చిపట్టిన వాడిలా చక్కర్లు కొట్టాడు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కదిర్‌పుర్ అనే గ్రామం వద్ద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.