లాఠీ దెబ్బలకు యువకుడు మృతి..ఎస్సై సస్పెండ్
By రాణి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మెడికల్ షాపుకు వెళ్తున్న యువకుడిపై పోలీసుల అత్యుత్సాహం అతడి ప్రాాణాలను బలి తీసుకుంది. మహమ్మద్ గౌస్ అనే యువకుడు సత్తెనపల్లి చెక్ పోస్ట్ మీదుగా మెడికల్ షాపుకు వెళ్తుండగా పోలీసులు అడుడుకున్నారు. ఎందుకు బయటికొచ్చావ్ ? ఎక్కడికెళ్తున్నావ్ ? అని ప్రశ్నిస్తూనే అతడు చెప్పే సమాధానం వినకుండా లాఠీకి పనిచెప్పారు. పోలీసుల దెబ్బలు తాళలేక గౌస్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గౌస్ మృతి చెందడంతో..పోలీసులే గౌస్ ను కొట్టి చంపేశారంటూ బంధువులు ఆందోళనకు దిగారు.
Also Read : చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఈ ఘటనపై ఐజీ ప్రభాకర్ రావు స్పందించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో రెడ్ జోన్లుగా ప్రకటించిన జిల్లాల్లో గుంటూరు ఒకటి. కంటైన్ మెంట్ ఏరియాలో గౌస్ బయటికి రాగా పోలీసులు ప్రశ్నించారని, మెడికల్ షాపుకు వెళ్తే కనీసం ప్రిస్క్రిప్షన్ కూడా చూపించకపోవడంతో అతనిపై లాఠీ చార్జ్ చేశారని తెలిపారు. గౌస్ మృతికి పోలీసులే కారణమని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఎస్సై రమేష్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా లాక్ డౌన్ సమయంలో సరైన ఆధారాలతో బయటికి రావాలని ఐజీ సూచించారు.
Also Read :అమ్మాయి ముందు అలా కూర్చోవడం పద్ధతి కాదు : పవన్ కు రేణు స్వీట్ వార్నింగ్