ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 70వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆనందం, ఆయురాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి, సినీ హీరో రామ్ పోతినేని, సుజనా చౌదరి, బొండా ఉమ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్, చంద్రబాబు మనుమడు దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీడీపీ నేతలు ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కాంక్షించారు. మళ్లీ నువ్వే రావాలి అంటూ నెటిజన్ల నుంచి జన్మదినశుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండ్స్ లో చంద్రబాబు బర్త్ డే టాప్ 2 లో ట్రెండ్ అవుతోంది. ఓ చిన్న పాప అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి. మళ్లీ నువ్వే రావాలి అని తన ముద్దు ముద్దు మాటలతో చాలా క్యూట్ గా విష్ చేసింది. కాగా..చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ మద్దతు దారులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.