వాడు మాములు చీడ‌పురుగు కాదు.. త‌ల్లి ఫోటోలు కూడా అస‌భ్యంగా చిత్రీక‌రించి..

By Medi Samrat  Published on  6 Nov 2019 6:23 AM GMT
వాడు మాములు చీడ‌పురుగు కాదు.. త‌ల్లి ఫోటోలు కూడా అస‌భ్యంగా చిత్రీక‌రించి..

ముఖ్యాంశాలు

  • మహిళల ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ రాక్ష‌సానందం
  • తన ఫొటో అసభ్యంగా పోస్ట్ చేయ‌డం చూసి షాక్ గుర‌యిన యువతి
  • సెల్‌ఫోన్‌లో 100కు పైగా మ‌హిళ‌ల ఫోటోలు

మహిళల ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ రాక్ష‌సానందం పొందుతున్న‌ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్‌ గయాస్‌(27) అనే వ్య‌క్తి శ్రీ పెరంబదూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను చెన్నై ట్రిప్లికేన్ ఏరియాలో అద్దె ఇంటిలో పెళ్లి చేసుకోకుండా సుమతి అనే యువతితో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సుమతితో కలిసి పలు కార్యక్రమాలకు హాజరైన గయాస్‌ మహిళలకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

అయితే.. ఓ యువతి ఫేస్‌బుక్‌ చూస్తున్న సమయంలో తన ఫొటో అసభ్యంగా చేసి పోస్ట్ చేయ‌డం చూసి షాక్ గుర‌య్యింది. వెంట‌నే చెన్నై వెస్ట్‌జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేసిన పోలీసులు మహ్మద్‌ గయాస్‌ను అరెస్టు చేశారు.

గయాస్‌ సెల్‌ఫోన్‌ తనిఖీ చేయగా 50 ఏళ్లలోపు 100 మందికి పైగా మహిళల‌ ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతను తన తల్లి, పిన్ని, బంధువులు ఫోటోలు సైతం అసభ్యంగా చిత్రీకరించాడు. గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట‌రాగేట్ చేస్తున్నారు.

Next Story
Share it