ముంబైలో సెక్స్ రాకెట్ నడుపుతున్న‌బాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జుహుస‌బ‌ర్బ‌న్‌లోని జెడ్ ల‌గ్జ‌రీ రెసిడెన్సీ హోట‌ల్ పై సోష‌ల్ స‌ర్వీస్ అధికారులు దాడి చేసి మేనేజ‌ర్ రాజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రాకెట్ నుంచి ఉజ్జెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌ల‌ను ఈ రాకెట్ నుంచి కాపాడారు. లాల్ అనే వ్య‌క్తి స‌హ‌కారంతో ఉజ్జెకిస్తాన్‌కు చెందిన జ‌రీనా అనే మ‌హిళ ఈ దందా న‌డిపిస్తోంద‌ని పోలీసులు పేర్కొన్నారు. విదేశాల నుంచి మ‌హిళ‌ల‌ను ముంబైలోని స్టార్ హోట‌ల్‌కు పంపిస్తూ, ఒక్కొ క‌స్ట‌మ‌ర్ వ‌ద్ద నుంచి రూ. 80 వేలు వ‌సూలు చేస్తూ ఈ దందా కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్‌ కుమార్ తో పాటు లాల్‌పై, మ‌హిళ జ‌రీనాను అదుపులోకి తీసుకుని, వ్య‌క్తుల అక్ర‌మ ర‌వాణా నిరోధ‌క చ‌ట్టం కింద వారిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.