సెక్స్ రాకెట్‌లో బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్
By సుభాష్ Published on 4 Jan 2020 9:46 PM IST
ముంబైలో సెక్స్ రాకెట్ నడుపుతున్నబాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జుహుసబర్బన్‌లోని జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్ పై సోషల్ సర్వీస్ అధికారులు దాడి చేసి మేనేజర్ రాజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రాకెట్ నుంచి ఉజ్జెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను ఈ రాకెట్ నుంచి కాపాడారు. లాల్ అనే వ్యక్తి సహకారంతో ఉజ్జెకిస్తాన్‌కు చెందిన జరీనా అనే మహిళ ఈ దందా నడిపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు. విదేశాల నుంచి మహిళలను ముంబైలోని స్టార్ హోటల్‌కు పంపిస్తూ, ఒక్కొ కస్టమర్ వద్ద నుంచి రూ. 80 వేలు వసూలు చేస్తూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్ కుమార్ తో పాటు లాల్‌పై, మహిళ జరీనాను అదుపులోకి తీసుకుని, వ్యక్తుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.