మోదీని కలవనున్న మమత..!

కోల్‌కతా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించే మమత ఆయనతో భేటీ కాబోతున్నారు. బుధవారం ఢిల్లీలో మోదీతో మమత భేటీ అవుతున్నారు. ఈ విషయాన్ని మమత కూడా ధృవీకరించారు. అయితే…రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులపైనే కలుస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. కాని..ప్రతిపక్షాలు మాత్రం శారద కుంభకోణం నుంచి బయటపడటానికే కలుస్తున్నారని విమర్శిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.