తెలంగాణలో ఇద్దరు కలెక్టర్లకు జరిమానా.. ఆర్డీవోకు జైలు శిక్ష

By సుభాష్  Published on  29 Jan 2020 3:37 PM GMT
తెలంగాణలో ఇద్దరు కలెక్టర్లకు జరిమానా.. ఆర్డీవోకు జైలు శిక్ష

తెలంగాణలోని మల్లన్నసారగ్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు కలెక్టర్లకు, ఒక ఆర్డీవోకు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభియోగాలతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రెండు వేల చొప్పున జరిమానా, సిద్దిపేట ఆర్డీవో జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్‌, అవార్డు ఇచ్చారని కొందరు రైతులు హైకోర్టును సంప్రదించారు.

దీంతో డిక్లరేషన్‌ను, అవార్డును రద్దు చేస్తూ గతంలో మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2019 మే నెలలో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మళ్లీ డిక్లరేషన్‌, అవార్డు ప్రకటించారని మరోసారి రైతులు కోర్టుమెట్లెక్కారు. ఇక రైతుల పిటిషన్‌లను విచారించిన హైకోర్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానాను చెల్లించకపోతే నెల రోజుల పాటు జైలుశిక్ష విధించాలని హైకోర్టు ఆదేశించింది.

Next Story