తెలంగాణలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం
By సుభాష్ Published on 25 Jun 2020 10:23 AM ISTతెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి 8 కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ఆడిటోరియంలో వర్సిటీ లోగో, బ్రోచర్, వబ్ సైట్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బుధవారం ఆవిష్కరించారు.
2020-21 విద్యా సంవత్సరంన నుంచి 8 కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ థికింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డాటా సైన్స్ అండ్ అనాలిసిస్, కంప్యూటర్ నెట్‌వర్స్, మల్లీమీడియా టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. అంతేకాకుండా రొబోటిక్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులతో పాటు మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, కంపూర్‌సైన్స్ ఇంజనీరింగ్ తదితర కోర్సులను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు.