కోహ్లీకి అభిమాని వినూత్న కానుక
By సుభాష్Published on : 6 Jan 2020 11:29 AM IST

సెలబ్రిటీలకు వారి అభిమానులు ఇచ్చే గిఫ్ట్ ల్లో ఒక్కోసారి వావ్ అనేలా చేశాయి. తన అభిమాని ఇచ్చిన గిఫ్ట్ ను చూసి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నోటమాటరాలేదు. అత్యంత అద్భుతంగా తయారు చేసిన తన హార్డ్‌కోర్ ఫ్యాన్‌ను అభినందించాడు. పొట్రెయిట్‌తో కూడిన ఫొటోపై సంతకం చేసాడు. ఇంతకీ ఆ పోట్రేట్ ఎలా చేసాడో తెలుసా.. పాత ఫోన్లను ఉపయోగించి. రాహుల్ అనే ఓ అభిమాని రూపొందించిన ఈ అద్భుత కళాఖండాన్ని చూసి కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. గువాహటికి చెందిన రాహుల్ విరాట్‌కు వీరాభిమానని. పాత ఫోన్లు, వైర్‌తో కలిసి కోహ్లీ రూపం వచ్చేలా కళాఖండాన్ని తయారు చేయడానికి రాహుల్ కి మూడు రోజుల సమయం పట్టిందట.
ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ బహుమతిపై ఆటోగ్రాఫ్ చేస్తూ తన అభిమానికి థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
Next Story