మాస్కుల తయారీ ఇలా - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

By Newsmeter.Network  Published on  10 April 2020 10:18 AM GMT
మాస్కుల తయారీ ఇలా - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనూ వినిపించే ఒక్కటే మాట కరోనా వైరస్‌.. ఎక్కడ విన్నా ఇదే పదం వినిపిస్తోంది. ఏ టీవీ ఛానల్‌ పెట్టినా, సోషల్‌ మీడియాలో ఎక్కడైనా కరోనా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అంతలా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలా కుతలం చేస్తోంది. ఈ వైరస్‌ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఫలితంగా ఇప్పటికే 6,500 మంది ఈ వైరస్‌ భారిన పడగా వీరిలో 199 మంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని, శానిటైజర్స్‌, సబ్బులతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మాస్కులను తప్పనిసరి చేశాయి. బయట దుకాణాల్లో మాస్కులు దొరకడం కష్టంగా మారింది. పలువురు మాస్కులు సొంతంగా తయారు చేసుకోవటం ఎలానో ఇప్పటికే సూచించారు.

Also Read :ఏప్రిల్‌ 14న జాతీయ సెలవు దినం.. ఎందుకంటే..?

తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట్లోనే మాస్కులను ఇలా తయారు చేసుకోండి అంటూ ఓ పోస్టు పెట్టారు. వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో మంత్రి చేసి చూపించారు. తొలుత శుభ్రమైన క్లాత్‌, సూది, దారం సహాయంతో చేతితోనే మాస్కు తయారీని చిత్రాల ద్వారా సామాన్య ప్రజలకూ అర్థమయ్యే ఈతిలో కేంద్ర మంత్రి చేసి చూపించారు. తన పోస్టుకు ' మాస్క్‌ ఇండియా'అనే హాష్‌ టాగ్‌ను కూడా జతచేశారు. పోస్టు పెట్టిన కొద్దిగంటల్లోనే సుమారు 55వేల లైక్‌లు వచ్చాయి. చాలా మంచి ఐడియా ఇచ్చారు మేడం అంటూ నెటిజర్లు స్మృతి ఇరానీని ప్రశంసిస్తున్నారు.



Next Story