'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్ వ‌చ్చేది ఎప్పుడు..?

By Newsmeter.Network  Published on  8 Dec 2019 4:06 AM GMT
సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ వ‌చ్చేది ఎప్పుడు..?

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న‌ రష్మిక మందన్న నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.

రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ మైండ్ బ్లాక్’ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుండి సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో… సోల్ ఫుల్ మెలోడీ ని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

Next Story
Share it