'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్ రిలీజ్ చేయనున్న 'సూపర్ స్టార్'

By Medi Samrat  Published on  16 Oct 2019 8:03 AM GMT
మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే... మ‌రో వైపు నిర్మాత‌గా సినిమాలు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలోరూపొందుతోన్న విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్నాడు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉంటే... ఇటీవల విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసారు.

ఈ బ్యానర్ పై విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తున్న‌ ఫస్ట్ మూవీ ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ చిత్రానికి ష‌మ్మిర్ సుల్తాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మంచోడు అనే ఇమేజ్‌ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ ఇమేజ్‌ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఎంతో ఫన్నీగా ఈ సినిమా ఉంటుంద‌ని.. నేటి యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది చిత్ర యూనిట్.

ఫస్ట్ లుక్ నుండి టీజర్ రిలీజ్ వరకు ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సాయంత్రం గం.4.30ని.లకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Next Story
Share it