బన్నీ మూవీపై.. మహేష్ డైరెక్టర్ సెటైర్-ఇండస్ట్రీలో హీట్ పెంచిన బాక్సాఫీస్ వార్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 10:06 AM GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో' కూడా.. సంక్రాంతి కానుకగా జనవరి 11నే రిలీజ్ కానుంది. దీంతో సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ వార్ ఆసక్తిగా మారింది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే...ప్రమోషన్స్ లో బన్నీ సినిమా 'అల వైకుంఠపురములో' జెట్ స్పీడుతో దూసుకెళ్తుతుంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో రిలీజ్ చేసి, మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ.. రికార్డులు నెలకొల్పతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు బన్నీ. ఇక మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్స్ తో హంగామా చేస్తున్నాడు. అయితే... బన్నీ మూవీ ప్రమోషన్స్ లో దూసుకెళ్తుండటంతో మహేష్ టీమ్ ఆలోచనలో పడిందని వార్తలు వస్తున్నాయి.
దీపావళి సందర్భంగా'అల.. వైకుంఠపురములో' చిత్రం నుంచి 'రాములో రాముల' సాంగ్ రిలీజ్ చేసారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సరిలేరు నీకెవ్వరు టీమ్ దీపావళి సందర్భంగా.. సినిమా స్టోరీ లీక్ మీద సుబ్బరాజు - వెన్నెల కిషోర్‌లతో షూట్ చేసి ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కనిపించి లీకుల పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అయితే..మన సినిమా సంక్రాంతికి రిలీజ్ కదా..? ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా అనీల్ రావిపూడి ఓ డైలాగ్ వదిలాడు.
ఈ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే... బన్నీ అల.. వైకుంఠపురములో ప్రమోషన్స్ ఇప్పటి నుంచి జోరుగా చేయడం పై సెటైర్ అని. మహేష్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇలా సెటైర్ వేశారని.. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. బాక్సాఫీస్ వార్‌లో మరింత హీట్ పెంచింది. మరి.. ఈ వార్‌లో ఎవరు విన్నర్‌గా నిలుస్తారో చూడాలి.