షర్ట్ లేకుండా మహేశ్ బాబు.. ఫోటో వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2020 1:43 PM IST
షర్ట్ లేకుండా మహేశ్ బాబు.. ఫోటో వైర‌ల్‌

క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డంతో ఇంటికే ప‌రిమితం అయ్యారు సినీన‌టులు. ఎప్పుడు షూటింగ్‌ల‌తో బిజీగా ఉండే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాక్‌డౌన్ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. త‌న కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌ల‌తో క‌లిసి ఆడుకుంటున్నాడు.

రీల్ లైఫ్‌లో కానీ, రియ‌ల్ లైఫ్‌లోనూ మ‌హేష్ బాబును చొక్కా లేకుండా ఎప్పుడూ చూసింది లేదు. మహేశ్‌ పిల్లలతో చేసే ఎంజాయ్‌ను ఎప్పటికప్పుడు నమత్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ తన ముద్దుల కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో ఆడుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలో మ‌హేష్ ష‌ర్ట్ లేకుండా క‌నిపించారు. మ‌హేష్ ఇలా మొద‌టి సారి క‌నిపించ‌డంతో అత‌డి అభిమానులు ఫిధా అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ జిమ్ బాడీ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. సంకాంత్రికి 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీతో బంఫ‌ర్ హిట్ అందుకున్నాడు మ‌హేష్‌. త‌రువాతి సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారాను తీసుకోవాల‌ని భావించిన ఆమె సున్నితంగా ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా చేయ‌లేదు. ఈ చిత్రం త‌రువాత మ‌హేష్ ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Next Story