పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్‌, విజయ్‌లకు మహేష్‌బాబు ఛాలెంజ్..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 4:48 PM IST
పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్‌, విజయ్‌లకు మహేష్‌బాబు ఛాలెంజ్..

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఎంతగానో సక్సెస్ అవుతోంది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున ఈ ఛాలెంజ్ లో స్వచ్చందంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అలాగే తమ స్నేహితులను ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేస్తూ వారితో కూడా మొక్కలు నాటిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. తన నివాసంలో కొన్ని మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. ఈ విషయాన్ని మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

నా పుట్టిన రోజును ఇంతకంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోలేనేమో..! అందుకే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాను. ఇప్పుడీ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా జూనియర్‌ ఎన్టీఆర్‌, తమిళ హరో విజయ్‌, హీరోయిన్‌ శృతి హాసలను నామినేట్‌ చేస్తున్నాను ఈ చాలెంజ్ ను ఎల్లలు దాటించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం" అంటూ మహేశ్ బాబు ట్వీట్‌ చేశారు.



మహేశ్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌, కుమార్తె సితార కూడా ఆయనకు సూపర్‌ స్పెషల్‌ విషెస్‌ను అందజేశారు.

“నిజమైన ప్రేమ అంటే ఏంటో అది నేను మీతో అనుభవించాను. హ్యాపీ బర్త్‌డే ఎంబీ. నేను ఇప్పుడు మరియు ఎల్లప్పడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.’’ అని మహేశ్‌బాబు తనను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను నమ్రతా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

మహేశ్‌బాబు ఎనిమిదేళ్ల కుమార్తె సీతారా కూడా సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది. సీతారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ “సంవత్సరంలో నాకు అత్యంత ఇష్టమైన రోజు !! హ్యాపీ బర్త్ డే నాన్నా. మీరు ఎప్పటికీ మంచి తండ్రి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

Next Story