మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాతి సినిమా మహేష్ బాబు మొదలెట్టే లోపు తన ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసేస్తూ ఉంటారు. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడాన్నే మహేష్ బాబు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇటీవల ఆయనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఈ విధంగా ఇచ్చారు..
మహేష్ గారు మీ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే..?  
మహేష్ బాబు: వినయం.. వినయం.. వినయం..
మూవీ సెట్ లో జరిగిన ఓ ఘటన మీరు ఎప్పుడూ మరచిపోలేని సంఘటన..?
మహేష్ బాబు: మూవీ సెట్ అన్నది చెప్పలేను కానీ.. 2001 లో మురారీ సినిమా విడుదలైనప్పుడు.. నేను, నాన్న కలిసి సుదర్శన్ 35 ఎం.ఎం. కు సినిమా చూడడానికి వెళ్లాం.. మార్నింగ్ షో సినిమా చూశాక తన తండ్రి ఎంతో అభిమానంతో నా భుజాల మీద చేతులు వేశాడు. అది ఎప్పటికీ మరచిపోలేను..!
పర్ఫెక్ట్ రొమాంటిక్ డేట్ అంటే మీ ప్లాన్ ఏమిటి..?
మహేష్ బాబు: భార్యతో కలిసి ఓ మంచి సినిమా చూడడం
ఇతరుల్లో మీకు నచ్చనిది..?
మహేష్ బాబు: నిజాయితీగా ఉండలేకపోవడం
యంగ్ గా ఉన్న మహేష్ బాబుకు మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే..?
మహేష్ బాబు: యంగ్ మహేష్ బాబు అంటే అది నా కొడుకే.. నీ తండ్రిలా ఉండు అని చెప్తా(నవ్వుతూ)
మీ మీద ఒక బయోపిక్ తీస్తే అది ఎలా ఉండాలి.. ఎవరు చేస్తే బాగుంటుంది..?
మహేష్ బాబు: నా జీవితం చాలా సింపుల్.. బోరింగ్ కూడానూ.. నీ మీద బయోపిక్ అసలు వర్కౌట్ కాదు
పర్ఫెక్ట్ విహారయాత్ర అంటే మీరు ఏమి చెప్తారు..?
మహేష్ బాబు: నా భార్య పిల్లలతో వెళ్లడమంటే చాలా ఇష్టం.. ఒక ప్రాంతం అంటూ లేదు కానీ.. అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది.
మీ జీవితంలో ఓ అభిమాని చేసిన పని ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి..?
మహేష్ బాబు: కొన్నేళ్ల క్రితం ఓ అభిమాని నాకో లెటర్ పంపించాడు.. అది ఓపెన్ చేస్తే బ్లడ్ తో నా పేరు రాసి ఉంది.
మీరు ఉదయం లేవగానే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారనుకో.. మొదట చేసే పని..?
మహేష్ బాబు: ఏమి చేస్తానో నాకు కూడా తెలీదు.. దేవుడే రాష్ట్రాన్ని కాపాడాలి(నవ్వుతూ)
టాలీవుడ్ కు చెందిన ముగ్గురు నటులతో రోడ్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటే.. ఎవరెవరిని తీసుకొని వెళ్తారు..?
మహేష్ బాబు: రామ్ చరణ్ తేజ్, తారక్.. అలాగే మెగాస్టార్ చిరంజీవి

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.