'మీకు మాత్రమే చెప్తా' కాన్సెప్ట్ ఎంటర్ టైనింగ్‌గా అనిపించింది

By Medi Samrat  Published on  16 Oct 2019 1:41 PM GMT
మీకు మాత్రమే చెప్తా కాన్సెప్ట్ ఎంటర్ టైనింగ్‌గా అనిపించింది

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన "మీకు మాత్రమే చెప్తా" ట్రైలర్ లాంఛ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ కాంబినేషన్ కొత్త గా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్త గా అనిపించింది. 'పెళ్ళి చూపులు' నాకు బాగా నచ్చిన సినిమా, విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీం అందరికీ అల్ ద బెస్ట్" అన్నారు.

Miku Mathrame Cheptha

నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ : "ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి నేనే ప్రొడ్యూస్ చేసాను. నిర్మాత బాధ్యతలు మా నాన్న గారు వర్ధన్ దేవరకొండ తీసుకున్నారు. నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అందంగా ఉంది. అడగగానే సపోర్ట్ చేసిన మహేష్ గారికి చాలా థాంక్స్.

Miku Mathrame Cheptha3

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ మూవీ లో నన్ను హీరో అంటున్నారు. కానీ ఆర్టిస్ట్ గానే నేను భావిస్తున్నాను. అందరికీ రిలేట్ అయ్యే కాన్సెప్ట్ ని దర్శకుడు షకీర్ బాగా హ్యాండిల్ చేసాడు. కథా, కథనాలు సూపర్ ఫన్ గా ఉంటాయి. విజయ్ ప్రొడక్షన్ లో చేస్తున్నాను అనే రెస్పాన్సిబిలిటీ తో పని చేసాను. ఈ మూవీ ట్రైలర్ లంచ్ చేసిన మహేష్ సర్ కి చాలా థాంక్స్ " అన్నారు.

Advertisement

Miku Mathrame Cheptha1

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ : " ఈ సినిమా చేయడానికి నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది కథ. తరుణ్ హీరో అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తన రోల్ ని బాగా చేసాడు. ప్రొడక్షన్ హౌస్ కూడా మొదటి సినిమా అనే ఫీల్ ఎప్పుడూ కలిగించలేదు. ఒక యంగ్ టీం అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story
Share it