ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన గవర్నర్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 2:10 PM GMT
ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన గవర్నర్‌..!

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ నుంచి ఫడ్నవీస్‌కు కబురు వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని ఫడ్నవీస్ చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చినప్పటి నుంచి స్తబ్ధత కొనసాగుతోంది. సీఎం సీటును 50 -50 ప్రాతిపదికన పంచుకోవాలని శివసేన షరతు పెట్టింది. దీనికి బీజేపీ ఒప్పుకోలేదు. శివసేన - కాంగ్రెస్‌ - ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కూడా ప్రచారం జరిగింది .అయితే...కాంగ్రెస్ - ఎన్సీపీ వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తుంది. శివసేన తన ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలించింది. శుక్రవారం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవి కాలం ముగిసింది.

అయితే...బీజేపీకి అసెంబ్లీలో 105 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచినప్పటికీ..బల నిరూపణ చేసుకోవాలి. దీనికి 50 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న శివసేన సపోర్ట్ చేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వం కూలిపోతుంది. ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకుంటానని గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం.

Next Story