మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తీరుపై ఇప్పుడు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కలెక్టర్‌ గౌతమ్‌ అంటేనే అధికారులు భయపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై కొరఢా ఝులిపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. విధుల్లో ఏదైనా తేడా వస్తే సస్పెన్షన్‌ ఆర్డర్లు ఇస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన కారోబార్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశారు.

మరో హాస్టల్‌ వార్డెన్‌ను బదిలీ చేయగా, ఓ పశువైద్యాధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు అంటే ప్రజల సమస్యలను తీర్చేందుకు ఉండాలి గానీ.. ఇలా నిర్లక్ష్యం చేసేందుకు కాదని హితవు పలికారు. విధి నిర్వహణలో ఎంతటి అధికారి అయినా నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.