ముఖ్యాంశాలు

  • నివ్వేరపోయిన బంధువులు
  • వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో సంఘటన
  • ఒక్కసారిగా కేక వేసిన వధువు

వనపర్తి: పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు..ఇద్దరూ బంధువులు. వారికి ఇరు కుటుంబాల పెద్దవాళ్లు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. పెళ్లికి పిలవాల్సిన వారిని అందరినీ పిలిచారు. అందరూ పెళ్లి కల్యాణమండపం ముందు కూర్చుకున్నారు. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ పెళ్లి తంతు మొదలు పెట్టాడు. పెళ్లి కూతురిపై జీలకర్ర బెల్లం పెట్టమని పెళ్లికొడుకుని పురోహితుడు పూరమయించాడు. ఒక్కసారిగా పెళ్లికూతురు పెద్ద కేక వేసింది. పెళ్లికి వచ్చిన వారంతా ఏమైందోనని భయపడ్డారు. ఇంతలోనే.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. ఆపండి అంటూ పెళ్లి పీటల నుంచి పెళ్లి కూతురు పక్కకు వచ్చింది. ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

గతంలోనే అమ్మాయి కుటుంబం.. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో స్థిరపడింది. కాగా కొత్తకోట మండలంలోని తన బంధువులకు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. పెళ్లికి షోలాపూర్‌ నుంచి అమ్మాయి స్నేహితుడు వచ్చాడు. అతడిని చూసిన పెళ్లికూతురు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మొండికేసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె బంధువులు.. పెళ్లికి వచ్చిన స్నేహితుడిపై దాడికి దిగారు. దీంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇలా మొత్తానికి పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబాల బంధువులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకొని కూర్చున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.