మహబూబ్‌నగర్‌: దొంగతనం చేశాడన్న కారణంతో ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌లో బాలుడిని గొలుసులతో బంధించారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం‌.. మాటల వరకే పరిమితం అయ్యింది. పోలీసుల ప్రవర్తన మరోలా కూడా ఉంటుందని మహబూబ్‌నగర్‌ పోలీసులు మరోసారి రుజువు చేశారు. ఈ ఘటనను చూస్తుంటే.. తమకు నచ్చిన రీతీలోనే పోలీసులు వ్యహరిస్తున్నారని అనిపిస్తోంది.

అక్రమంగా డబ్బులు సంపాదించే బడా బాబులకు సలాం కొట్టే పోలీసులు.. సామాన్యుల విషయానికి వచ్చేసరికి తీరు మార్చుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ పలుసార్లు విమర్శల పాలయ్యారు. తాజాగా మహబూబ్‌నగర్‌ టౌటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ 13 సంవత్సరాలు బాలుడిని సెల్‌ఫోన్‌ దొంగతనం చేశాడనే నెపంతో అరెస్ట్ చేశారు. 8వ తరగతి చదువుతున్న బాలుడ..స్థానికంగా ఉన్న మొబైల్‌ షాపులో సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. షాపు యాజమాని ఫిర్యాదుతో బాలుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి చితకబాదారు. బాలుడిని గొలుసులతో బంధించటంతో పోలీసులను పలువురు విమర్శిస్తున్నారు.

సెల్‌ఫోన్‌ రికవరీ చేసి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి గానీ.. ఇలా గొలుసులతో బంధించడమేంటని బాలల హక్కుల కార్యకర్తలు ఫైర్‌ అవుతున్నారు. పిల్లల హక్కులను ఉల్లంఘిస్తూ బాలుడిని బంధించడాన్ని.. బాలల హక్కుల సంఘం రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై బాలల హక్కుల సంఘం మహబూబ్‌నగర్‌ ఎస్సీ రెమో రాజేశ్వరిని సంప్రందించగా.. టూటౌన్‌ ఇన్స్పెక్టర్‌పై చర్యలు చేపట్టామన్నారు. బాధ్యులైన అధికారులపై సహితం చర్యలు చేడతామని తెలిపారు. ఈ ఘటన పిల్లల హక్కులను హరించేదిగా ఉందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మచ్చ తెచ్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టలాని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.