రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆకాంక్షను ఆసరాగా చేసుకోని సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీ భ‌వ‌న్‌లో మాట్లాడిన ఆయ‌న.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. అమలుకు సాధ్యం కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని.. కేసీఆర్ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని.. తెలంగాణ ఉద్యమం.. సకలజనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులది అత్యంత కీలకపాత్రని ఆయ‌న అన్నారు.

దసరాకు కార్మిక కుటుంబాలు పస్తులు ఉండేలా చేసిన కేసీఆర్ కు.. ఆర్టీసీ కార్మికుల పిల్లల శోకాలు తగులుతాయని ఫైర్ అయ్యారు. కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. గవర్నర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. కార్మికుల ఉద్యోగాలు పోవని.. రాజ్యంగం అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసీ అప్పుల్లో ఉన్న‌ది అనేది ఉత్తమాట అని.. ఉద్యమంతో పదవులు పొందిన వారు.. ఇప్పుడు కార్మికుల సమస్యపై స్పందించడం లేదని మధుయాష్కీ అన్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort