అతనెవరో కూడా నాకు తెలియదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలి
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 10:56 AM ISTనచ్చావులే అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మాధవీలత ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ హీరోయిన్ గా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈ విషయంపై అప్పట్లో ఆమెను ఇంటర్వ్యూ చేసిన యూ ట్యూబ్ ఛానెళ్లకు హీరోయిన్ గా ఎదగాలంటే కొన్ని సమర్పించుకోవాల్సి ఉంటుందని, అది ఆమెకు నచ్చదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాతి నుంచి మాధవీలతకు సినిమాలో నటించే అవకాశాలే రాలేదు.
తాజాగా ఆమె ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ కు లీగల్ నోటీసులు పంపారు. రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్లపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. అదే ధోరణిలో శ్రీరెడ్డి, మాధవీలత లపై కూడా నోటికొచ్చినట్లు తిట్టడంతో..మాధవీలత రాకేష్ మాస్టర్ చేష్టలపై స్పందించారు. తనకు రాకేష్ మాస్టర్ సారీ చెప్పాలంటూ లీగల్ నోటీసులు పంపారు.
అసలు రాకేష్ మాస్టర్ మాధవీలత గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. తన డ్రస్సింగ్ స్టైల్ పై, తాను చేస్తున్న సమాజ సేవ గురించి తప్పుగా మాట్లాడిన వారంతా తనకు క్షమాపణ చెప్పాలంటూ మాధవీలత నెట్టింట్లో ఓ వీడియో పోస్ట్ చేయగా..దానిపై రాకేష్ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. జప్ఫాదాన, ముదనష్టపు దాన ఎవరిని నువ్వు అలా అడుగుతున్నావ్ ? అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. అలా వీరిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
రాకేష్ మాస్టర్ మాధవీలతను అసభ్యపదజాలంతో తిడుతూ పెట్టిన వీడియో కాస్త బాగా వైరల్ అవ్వడంతో మాధవీలత స్పందించానని చెప్పుకొచ్చింది. అసలు రాకేష్ మాస్టర్ ఎవరో కూడా తనకు తెలియదని, అయినప్పటికీ ఆయన తననెందుకు తిట్టారో అర్థం కాలేదన్నట్లు పేర్కొంది. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాకేష్ మాస్టర్ కు పంపిన లీగల్ నోటీసుల్లో అతడి వీడియోలను పబ్లిష్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల పేర్లను కూడా ఆమె ప్రతిపాదించారు.