హైదరాబాద్ : మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో తెలంగాణ విద్యా వేదిక అధ్యక్షుడు మద్దిలేటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దిలేటితోపాటు టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని గద్వాల్ పీఎస్‌కు తరలించారు. వీరిద్దరూ తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు. అంతేకాదు.. తెలంగాణ విద్యార్ది వేదిక స్టూడెంట్స్ ను కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 8మందిపై కేసులు పెట్టారు. అయితే..పోలీసులు చాలా అన్యాయంగా మద్దిలేటిని అరెస్ట్ చేశారని ప్రజాసంఘాలు ఆరోపించాయి. ప్రశ్నించే గొంతులను నొక్కుతారా అంటూ ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కొన్ని రోజుల క్రితం ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కారణంతో ఇంట్లో సోదాలు చేసి జగన్ ను అరెస్ట్ చేశారు. జగన్ స్టూడెంట్ మార్చ్ పత్రికకు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=r1_lSlCTDHc

https://www.youtube.com/watch?v=OEWPnUd4e18

https://www.youtube.com/watch?v=6rfISKeLAgM

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story