ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : మా అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 5:35 AM GMT
ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : మా అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌

ఈరోజు ఇండ‌స్ట్రీ గీతాంజ‌లి లాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని మా అధ్యక్షుడు వీకే నరేష్‌ తెలిపారు.. అమ్మ‌... విజ‌య‌నిర్మ‌ల‌తోనూ ఆవిడ‌కు మంచి అనుబంధం ఉంది. ఇక న‌టిగా ఆవిడ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌క్షిణాది భాష‌ల్లోనే కాదు.. హిందీలోనూ న‌టించారు. న‌టిగానే కాదు.. వ్య‌క్తిగ‌తంగానూ గీతాంజ‌లి ఎప్పుడూ సంతోషంగా, అంద‌రితో క‌లివిడిగా ఉండేవాన్నారు. అలాంటావిడ ఉన్న‌ట్లుండి ఇలా అంద‌రినీ వ‌దిలేసి వెళ్లిపోతార‌ని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో అంద‌రికీ ఆమె ఎంతో చేరువ‌గా ఉండేవారన్నారు. మంచి, చెడుల్లో భాగ‌మైయ్యేవారని.. అలాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి మ‌న‌ల్ని విడిచిపెట్టిపోవ‌డం బాధాక‌రమన్నారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మా అధ్య‌క్షుడు వీకె న‌రేష్ అన్నారు.

జీవితారాజ‌శేఖ‌ర్: ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారని.. మా అసోషియేషన్‌ కార్యనిర్వాహక ఉపాధ్యాక్షులు డాక్టర్‌ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తీరని లోటుగా మిగిలిందని తెలిపారు. శ్రీమతి గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.

Jeevitha Rajashaker

Next Story
Share it