ఆవేశంతోనే .. ఉద్దేశపూర్వకంగా కాదు..

By Newsmeter.Network  Published on  23 Jan 2020 4:15 PM GMT
ఆవేశంతోనే .. ఉద్దేశపూర్వకంగా కాదు..

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు శాసన మండలిలో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అధికార, విపక్షాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాల అనంతరం ఈ రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ప్రకటించారు. తమకు అనుకూలంగా నిర్ణయం రాలేదన్న ఆగ్రహంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ పైకి దూసుకెళ్లారు. పోడియంపైకి ఎక్కి చైర్మన్‌ ముందున్న కాగితాలను చింపి పడేయగా, మరికొందరు చైర్మన్‌తో వాదించేందుకు ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్‌పై దుర్భాష లతో విరుచుకుపడటంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కాసేపు మౌనం వహించిన షరీఫ్‌.. అనంతరం సభ నిరవధిక వాయిదా వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తాజాగా దీనిపై పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఛైర్మన్‌ షరీఫ్‌ స్పందించారు. వైసీపీ సభ్యులు ఆవేశపూరితంగా మాట్లాడారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. మూడు రాజధానుల లేక ఒక రాజధాని అనే విషయంపై తానేమి కామెంట్‌ చేయనని చెప్పారు. బిల్లులపై తనకున్న విశేషాధికారలతోనే సెలక్ట్‌ కమిటీకి పంపినట్లు తెలిపారు.

Next Story