అదృష్టం అనుకోవాలో లేక అద్భుతం అనుకోవాలో కానీ... రెండంతస్తుల భవనం పై నుంచి కింద పడినా చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడాడంటే వింత విషయమే కదా..ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని టిగంగఢ్ లో జరిగింది. అదంతా సిసి టీవి లో రికార్డ్ అయ్యింది. ఇరుకు సందుల్లోంచి రిక్షా మెళ్లగా వెళ్తుండగా మూడేళ్ళ పర్వ్ జైన్ అనే బాబు అందులో పడ్డాడు. రెండస్తుల మీద ఆడుకుంటున్నవాడు పొరపాటున తూలి కింద పడిపోయాడు. పడటం పడటం సరిగ్గా రిక్షా లోకి వచ్చి పడ్డాడు. రిక్షాలో ఎవరు లేకపోవడం, బాబుకి దెబ్బలేమీ తగలకపోవడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

రిక్షా రావడం ఒక నిముషం అటూ ఇటూ అయినా బాబుకి తీవ్రమైన దెబ్బలు తగిలేవే... ఇది అదృష్టం కాకపోతే ఇంకేమిటి??

సత్య ప్రియ బి.ఎన్

Next Story