ఆ మజాతోనే రోజంతా గడిపిన 'భగ్న ప్రేమికులు'
By అంజి Published on 15 Feb 2020 3:05 PM ISTఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే రోజున యువత వారి ప్రేమైకంలో మునిగిపోయారు. రెండుక్షరాల ప్రేమను కొందరు ప్రేమికులు రెండు క్షణాలపాటే నిలుపుకుంటే.. మరికొందరు ప్రేమ పాటలు పాడుకొని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు భగ్న ప్రేమికులు ప్రేమ పాటలు పాడుకుంటూ.. వాటిని నిజం కూడా చేశారు. ఒకరు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ అంటే.. ఇంకొకరు ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనుకుంటూ, ఇలా మంచి, చెడు అనుభవాలతో శుక్రవారం వాలైంటెన్స్ డే గడిచిపోయింది.
వాలెంటైన్ స్మారకంగా ఫిబ్రవరి 14ను ప్రపంచవ్యాప్తంగా వాలైంటెన్ డే (ప్రేమికుల దినోత్సవం)గా జరుపుకుంటున్నారు. కాగా ప్రేమికుల దినోత్సం రోజున తమిళనాడులోని పర్యాటక, విహార ప్రాంతాలు, పార్క్‌లు ప్రేమ జంటలతో కళకళలాడాయి. పార్క్‌లు, రెస్టారెంట్ల వద్ద బైక్‌లు, కార్లు బారులు తీరిపోయాయి.మహాబలిపురంలో అయితే ఉదయం 8 గంటల నుంచే ప్రేమ పక్షులు చేరుకున్నాయి. ప్రేమికులు నిత్యం ఎదో ఒక చోట కలుసుకుంటూనే ఉంటారు. అది ఫిబ్రవరి 14న కలిసి ఆ మజానే వేరు అన్నట్లుగా ఇప్పటి ప్రేమ జంటలు వ్యవహరిస్తున్నాయి. ప్రేమలో భిన్నమైన రకాలున్నాయి. వాటన్నిటి వదిలిపెట్టి.. పరస్పర ఆకర్షణలకే వాలైంటెన్ డే పరిమితమైంది. చెన్నై మెరీనా బీచ్, బిసెంట్‌నగర్ బీచ్, పార్క్‌ల్లో ప్రేమ జంటలు ఎంజాయ్ చేశాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ఇసుకపై గంటల తరబడి కూర్చోని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. మనసులోని మాటలను చెప్పుకుంటూ, గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు.
అయితే కొందరు పోలీసులు ఇదే అదనుగా భావించి జేబులు నింపుకున్నారు. బైక్‌లు, కార్లలో ఉత్సహంగా రోడ్డుపై వెళ్తున్న వారిని తనిఖీల పేరుతో ఆపి.. స్పీడ్‌గా వెళ్తున్నారని, హెల్మెట్ లేదని సాకులు చెబుతూ ఫైన్‌లు విధించారు. కొన్న జంటలైతే.. తగినంత డబ్బు లేకపోయేసరికి.. వారి విలువైన వస్తువులను దుకాణాల్లో కుదువబెట్టి మరీ పోలీసులకు ఫైన్ కట్టారు.
ఇక హైదరాబాద్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. పలు షాపింగ్ సెంటర్‌లలో చొరబడి అక్కడి వస్తువులను పగలగొట్టారు. ఈ ఘటనలకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.