భారీ శబ్దంతో వణికిపోయిన పారిస్‌వాసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2020 1:30 PM GMT
భారీ శబ్దంతో వణికిపోయిన పారిస్‌వాసులు

పారిస్‌ నగరం భారీ శబ్దంతో దద్దరిల్లింది. ఈ శబ్దం విన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భవనాలు కాస్త అటూ, ఇటూ ఊగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేం భారీ శబ్దాన్ని విన్నాం. మీకేమైనా వినిపించిందా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో జనం అలాంటి సందేశాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వార్తలు గందరగోళానికి గురి చేశాయి. భయంతో వణికిపోతూ పోలీసులకు ఫోన్లు చేశారు.

పారిస్ ప్రాంతంలో చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఇది పేలుడు కాదు. ఇది సౌండ్ అడ్డంకిని దాటిన ఫైటర్ జెట్" అని పారిస్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అత్యవసర ఫోన్ లైన్లకు కాల్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. భారీ శబ్దం రావడంతో భవనాలు కదిలాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పలు వార్తలు వచ్చాయి. నగరంలో ఎటువంటి పొగ లేదా మంటలు కనిపించినట్లు కూడా దాఖలాలు లేవు. పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఆటగాళ్లను ఈ పేలుడు శబ్ధం కొన్ని నిమిషాలపాటు ఆడకుండా నిలిపివేసింది.



Next Story