మనకు ఏ చిన్న సందేహం వచ్చినా.. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, గూగుల్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటాం. అలా ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువగా ఎలాంటి విషయాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారో చూద్దామా..
భారతీయులకు క్రికెట్ మీద ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతుంటారు. మ్యాచ్ చూడలేకపోతే.. ఎప్పటికప్పుడు క్రికెట్ అప్‌డేట్స్ ఫాలో అవుతూనే ఉంటారు. అలా ఎక్కువ మంది ఈ ఏడాది గూగుల్‌లో క్రికెట్ గురించి శోధించారు. అందులో తొలి స్థానంలో అందరికీ ఇష్టమైన ఐపీఎల్ ఉంది. ఆ తర్వాత స్థానంలో క్రికెట్‌కు సంబంధించిన టీ20 వరల్డ్ కప్ ఉంది. 2024లో భారతీయులు ఎక్కువగా వెతికిన స్పోర్ట్స్ ఈవెంట్లలో కూడా క్రికెట్‌దే పైచేయి ఉంది. ఇక టాప్ 10 శోధనలలో క్రీడలకు సంబంధించి 'ఒలింపిక్స్ 2024', ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్‌లు కూడా ఉన్నాయి.
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ట్రెండ్స్ ఇవే
1. ఐపీఎల్
2. టీ 20 వరల్డ్ కప్
3. బీజేపీ
4. ఎన్నికల ఫలితాలు
5. ఒలింపి్స్
6. Excessive Heat
7. రతన్ టాటా
8. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9. ప్రో కబడ్డీ లీగ్
10 ఇండియన్ సూపర్ లీగ్