2024లో విడాకులు తీసుకొని అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేసిన జంట‌లివే..!

2024 సంవత్సరం చిత్ర‌సీమ‌తోపాటు క్రీడా రంగానికి సవాలుగానే ఉందని చెప్పాలి..

By Medi Samrat  Published on  13 Dec 2024 9:10 AM IST
2024లో విడాకులు తీసుకొని అంద‌రినీ దిగ్భ్రాంతికి గురిచేసిన జంట‌లివే..!

2024 సంవత్సరం చిత్ర‌సీమ‌తోపాటు క్రీడా రంగానికి సవాలుగానే ఉందని చెప్పాలి.. సినిమాల విష‌యం ప‌క్క‌కుపెడితే తారాల‌ సంబంధాల విషయానికి వస్తే.. పలువురు ప్రముఖ సెలబ్రిటీ జంట‌ల‌ విడాకులు పరిశ్రమతో పాటు ప్రేక్షకులను కూడా దిగ్భ్రాంతికి గురిచేశాయి. విడిపోయిన జంట‌ల వివ‌రాలు తెలుసుకుందాం.

1.ఏఆర్ రెహమాన్-సైరా బాను


ఏఆర్ రెహమాన్ తన 28వ ఏట 1995లో సైరా బానును పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. కానీ దాదాపు మూడు దశాబ్దాల ప్రేమ, సామరస్యపూర్వక సంబంధాల‌ను కాద‌ని ఈ జంట విడిపోతున్నామ‌ని ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. ఈ వార్త సినీలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

2.హార్దిక్ పాండ్యా-నటాసా స్టాంకోవిచ్


స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటి నటాసా స్టాంకోవిచ్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వారి డేటింగ్‌, వివాహం ప్రజలను బాగానే ఆకర్షించింది. పెళ్లయి నాలుగు సంవత్సరాలు కాగా.. ఈ జంట‌కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే స‌డెన్‌గా ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకుని జ‌నాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. త‌మ అననుకూలతను ఉదహరిస్తూ జంటగా వారి ప్రయాణాన్ని ముగించారు.

3.సానియా మీర్జా-షోయబ్ మాలిక్


టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల ప్రేమ‌ సరిహద్దులను దాటి ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. 14 సంవత్సరాల వివాహం బంధం, ఒక కొడుకుకు తల్లిదండ్రులుగా చాలా బాగా ఉన్న‌ ఈ జంట విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించి అంద‌రిని షాక్‌కు గురి చేశారు. వీరి విడాకులు భారత్‌, పాకిస్తాన్‌లోని అభిమానులను షాక్‌కు గురి చేసింది.

4.ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్


విడిపోయిన రెండు సంవత్సరాలు తర్వాత నటుడు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 13 బి కింద విడాకుల కోసం దాఖలు చేయడం ద్వారా ఈ జంట తమ వివాహా బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.

5.నవాజుద్దీన్ సిద్ధిఖీ-ఆలియా సిద్ధిఖీ


మీడియా దృష్టిని బాగా ఆకర్షించి.. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య ఆలియా 2024లో విడాకులను ఖరారు చేసుకున్నారు. బహిరంగ ఆరోపణలు, ప్రతి-ఆరోపణలతో నిత్యం వార్త‌ల‌లో నిలిచింది ఈ జంట‌. వారి వ్యక్తిగత పోరాటాలు మీడియాలో తీవ్ర‌ చర్చనీయాంశంగా మారాయి. ఆఖ‌రికి ఈ జంట విడాకులు తీసుకుని ఎవ‌రి ప‌నిలో వారు నిమ‌గ్న‌మ‌య్యారు.

6.ఇమ్రాన్ ఖాన్-అవంతిక మాలిక్


ఇమ్రాన్ ఖాన్, మాజీ నటి అవంతిక మాలిక్ యుక్తవయస్సు నుండే రిలేష‌న్‌లో ఉన్నారు. అయితే వారి బంధాన్ని 2024లో ముగించారు. ఇద్ద‌రినీ తిరిగి కలపడానికి.. వారి బంధాన్ని పునర్నిర్మించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరికి ఈ జంట చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకులు కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

Next Story